ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి లభించిందని భారత ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు ఇవాళ పండుగలాంటిదని విజయోత్సవ సభలో చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ప్రధాని నరేంద్ర మోడీని గజమాలతో సత్కరించారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు. ఢిల్లీని వికసిత్ రాజధానిగా మారే అవకాశం ఇచ్చారు. ఢిల్లీ విజయంతో బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందన్నారు.
ఢిల్లీ విజయం సామాన్య విజయం కాదని.. ఢిల్లీని అబివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. మా పార్టీ పై నమ్మకం ఉంచిన ఢిల్లీ ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా ఢిల్లీ ప్రజలు బీజేపీ వెంటే ఉన్నారని.. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రజలు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు చూపించిన ప్రేమను అనేక రెట్లు తిరిగి ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.