హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న ప్రజలకు ఊహించని షాక్ తగలనుంది. గ్రేటర్ హైదరాబాద్లో తాగునీరు సరఫరా పుష్కలంగా అవుతున్నప్పటికీ.. నగర శివారు కాలనీవాసులకు మాత్రం నీటి సమస్య తప్పడం లేదు. ఈ చలికాలం లోనే ఈ సమస్యలు తలెత్తుతూ ఉన్న నేపథ్యంలో… వచ్చేది వేసవికాలం. దీంతో అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు.
కొత్తగా వెలుస్తున్న కాలనీలో ప్రజలు అత్యధికంగా సతమతమవుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా నగర శివారులో… ఇండ్లు విస్తరిస్తున్నాయి. వందలాది కాలంలో వెలుస్తున్నాయి. లక్షలాది మంది అక్కడ నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ తాగునీటి వ్యవస్థ సరిగా లేక నేటికీ ట్యాంకర్ల పైనే వారు ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
పరిష్కారానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్న అప్పటికీ… పనుల్లో జాప్యం అలాగే ఇతర సమస్యల కారణంగా… ప్రజలకు నీటి సమస్య తగ్గడం లేదు. ముఖ్యంగా నాగారం అలాగే దమ్మాయిగూడ పురపాలికల్లో నాలుగు రోజులకోసారి నీటి సరఫరా అవుతోంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అటు పోచారం మున్సిపాలిటీ లోనూ ఇదే పరిస్థితి. దీనిపై ప్రభుత్వం అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు.