ఫ్రెండ్ పిలిచాడని వెళితే ఏకంగా 9 రోజులు..!!

-

ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా మహిళల పై లైంగిదాడు లు ఆగటం లేదు. అలాగే ప్రస్తుత సోషల్ మీడియా విప్లవం వల్ల అమ్మాయిలు చాలా సులభంగా  మోస పోతున్నారు. ఏది ప్రేమో ఏది ఆకర్షణ తెలుసుకోలేని స్థితిలో వున్నారు. దీన్ని అవకాశం గా తీసుకొని కొందరు దారుణానికి ఒడిగట్టు తున్నారు. తాజాగా  పంజాబ్‌లోని లుధియానాలో  ఫ్రెండ్ అని నమ్మి వెళితే ఏకంగా 10 రోజులు అత్యాచారం చేసిన  ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

 

వివరాల్లోకి వెళితే లుధియానాలోని హతుర్‌కు చెందిన జస్పాల్ సింగ్, బాధిత యువతి ఇద్దరూ స్నేహంగా వుండేవారు. అయితే, తనకు  షాపింగ్ చేయడం లో  సహాయం చేయాలని, సెప్టెంబర్ 30న రాయికోట్‌కు రావాలని యువతిని కోరాడు. దానితో నమ్మిన యువతి అతని కోసం రాయికోట్‌ లో అతను చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం.. మత్తు మందు కలిపిన ఆహారాన్ని ఆమెతో తినిపించాడు. దానితో యువతి వెంటనే మత్తులోకి జారుకుంది.మరో ఇద్దరు స్నేహితులను పిలిపించి అక్కడినుండి ఆమెను గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకొని వెళ్లాడు.

ఆరోజు నుండి వరసగా   9 రోజుల పాటు ఆమె ను విచ్చలి విడిగా రేప్ చేశాడు. అలాగే మధ్యలో మత్తు మందు ఇస్తూ పోయాడు. అక్టోబర్ 8న యువతి స్పృహలోకి రాగా, అక్కడినుండి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. దానితో అతను విపరీతంగా కొట్టి మళ్లీ అత్యాచారం చేశాడు. ఎలా గోలా  తప్పించుకుని స్వగ్రామానికి వచ్చిన యువతి. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు  జస్పాల్ సింగ్‌ ను అరెస్ట్ చేసి ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 342, 376 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version