ఆగష్టు13-15వరకు ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురాలి – కేంద్రం

-

ఆగష్టు13-15వరకు దేశంలో ప్రతి ఇంటి పైన మన జాతీయ జెండా రెపరెపలాడాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని కూడా అన్ని రాష్ట్రాల సిఎంలతో దీనిపై మాట్లాడారని.. హర్ ఘర్ తిరంగా.. ఘర్ ఘర్ తిరంగా పేరుతో కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. పార్టీలు, రాజకీయాలకతీతంగా ఇళ్ల పై జెండాను ఎగురేయాలని.. భారతీయులు దేశ భక్తికి చిహ్నంగా అందరూ భాగం కావాలని కోరారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.

పింగళి వెంకయ్య ఫొటోతో‌ పోస్టల్ స్టాంపును విడుదల చేస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. ఆగష్టు 2న పింగళి వెంకయ్య శత జయంతి జరుపుకుంటున్నామని.. ఆయన స్వగ్రామం భట్ల పెనుమర్రు వెళ్లి కుటుంబ సభ్యులను కలుస్తానని పేర్కొన్నారు. ఢిల్లి, కోల్ కత్తాలో పంద్రాగస్ట్‌ జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారని.. ఢిల్లోలో ఆయన ఫొటోతో‌ పోస్టల్ స్టాంపును విడుదల చేస్తామన్నారు.

వెంకయ్య రూపొందించిన నిజమైన జెండాను ప్రదర్శిస్తామని.. మువ్వన్నెల జెండా చూస్తే జాతీయత ఉప్పొంగుతుందని చెప్పారు. ఆగష్టు 2నే పింగళి జయంతి సభ వేదిక మీద నుంచే ఒక పాట విడుదల చేస్తున్నామని.. ప్రధాని, అమిత్ షా లు పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను సన్మానిస్తారని తెలిపారు. ఢిల్లీలో ఎయిర్ పోర్ట్ నుంచి పార్లమెంటు విజయ చౌక్ వరకు ఆగష్టు3న యాత్ర చేపట్టామని.. పార్లమెంటు సభ్యులు అంతా మోటార్ సైకిల్ పై తిరంగా యాత్రలో పాల్గొంటారన్నారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version