ప్రభాస్ కు గాయం.. మరో పది రోజులు రెస్ట్

-

రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన పాన్ ఇండియా మూవీ “రాధేశ్యామ్”. ఈ చిత్రం అనుకున్న ఫలితాన్ని అందించలేకపోయింది. దీనికి ముందు వచ్చిన సాహో సైతం పాక్షిక విజయాన్ని అందుకుంది. అయితే గతంలో రాధె శ్యామ్ షూటింగ్ సమయంలో ప్రభాస్ స్పెయిన్ లో తన మోకాలికి చిన్నపాటి ఆపరేషన్ చేయించుకున్నాడని కొన్ని వార్తలు వెలువడ్డాయి. కానీ ప్రభాస్ సన్నిహితులు ఎవరు దీనిపై పెదవి ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం ఆదిపురుష్ చిత్రం షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ కి సిద్ధమయ్యాడు.

అయితే తాజాగా గాయం తిరగబడటంతో ప్రభాస్ ఇటీవల మళ్ళీ యూరప్ వెళ్లినట్లు సమాచారం. అయితే ప్రభాస్ ను పరీక్షించిన వైద్యులు 10 రోజులపాటు రెస్టు తీసుకోమని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో తర్వాతే ప్రభాస్ “ప్రాజెక్ట్ కే, సలార్” షూటింగ్ లలో పాల్గొననున్నాడు. అయితే ఇది మైనర్ ఆపరేషనే అని, దాని గురించి అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రభాస్ సన్నిహితులు అంటున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version