ఈ ఆకులతో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

-

అరటికాయ కంటే అరటితొక్కలో ఎక్కువ పోషకాలుంటాయంటారు. యాపిల్ పొట్టుతో తింటేనే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. ఇలా అసలైన పండ్ల కంటే వాటి తొక్కలు, ఆకుల్లో పోషకాలుంటాయని మీకు తెలుసా.. పండ్లతో పాటు వాటి ఆకుల ద్వారా ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.. ఈ ఆకులు అనేక రకాల నివారణలుగా , ఔషధాల తయారీలో ఉపయోగపడతాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీ చదవండి.. ఏ ఆకులతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయో తెలుసుకోండి..

జామ..  ఆకులను ఆయుర్వేదంలో అనేక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. భోజనం తర్వాత జామ ఆకు టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. జామ ఆకు పదార్దాలు దాని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలకు ప్రభావవంతంగా ఉన్నాయని అనేక అధ్యయనాలు వివరించారు. ఉదర సమస్యలను తొలగించడంతో పాటు, అల్సర్లను నయం చేయడంలో కూడా ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

బొప్పాయి.. ఆకులు అనేక తీవ్రమైన వ్యాధుల లక్షణాలను తగ్గించడానికి ఉపయోగపడుతాయని ఆదునిక వైద్య శాస్త్రంతో పాటు ఆయుర్వేదంలో వివరించారు. దీని వినియోగం ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది, ముఖ్యంగా డెంగ్యూ జ్వరానికి సంబంధించిన లక్షణాల చికిత్సలో ఉపయోగపడుతుంది. డెంగ్యూలో ప్లేట్‌లెట్స్ స్థాయిని తగ్గినప్పుడు బొప్పాయి ఆకులను తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కాకుండా, బొప్పాయి ఆకుల సారం రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

మామిడి ఆకులు..  మామిడి పండు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు, వాటి ఆకులు కూడా మీకు అనేక విధాలుగా ప్రయోజనాలను అందించగలవని మీకు తెలుసా. ముఖ్యంగా ఇది కొవ్వును తగ్గించడంలో ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. మామిడి ఆకుల సారం జీవక్రియను సరిచేయడం ద్వారా శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తగ్గుతుంది. మధుమేహం, మెటబాలిక్ సిండ్రోమ్‌ను నిర్వహించడంలో ఈ అకులు ప్రయోజనకరంగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version