రాజకీయాల్లో ఎప్పుడు నిప్పు, ఉప్పులా ఉండే నాయకులు ఒకే దగ్గర కూర్చుని మాట్లాడుకోవడం చాలా అరుదు. ఇలాంటి ఘటనలు ఏదో ఒక సందర్భంలో మాత్రమే అరుదుగా కనిపిస్తుంటాయి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉంటాయి. ఆ సందర్భంగా ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేతలైన రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధికార పక్షాన్ని ఇరకాటంలో పెడుతూనే ఉంటారు.
ఇరువరి మధ్య అగ్గిరాజేసినట్లు ఒకరిమీద మరొకరు విమర్శలు, మాటల దాడులు చేసుకుంటూ కనిపిస్తారు.కానీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహాపరినిర్వాణ్ దివస్ సందర్భంగా భారత ప్రధాని మోడీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇద్దరూ కరచాలనం చేసుకొని కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. దీంతో కెమెరాలన్నీ వారినే ఫోకస్ చేశాయి. ఒకే ఫ్రేంలో వీరిద్దరితో పాటు మాజీ ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ సైతం నవ్వుతూ కనిపించారు. దీనికి ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం హాజరయ్యారు.
ఒకే ఫ్రేమ్‌లో మోదీ, ఖర్గే.. నవ్వులు విరిశాయి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహాపరినిర్వాణ్ దివస్ సందర్భంగా పరస్పరం పలకరించుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
ఇద్దరూ కరచాలనం చేసుకొని కాసేపు నవ్వుతూ మాట్లాడుకోవడంతో అందరి కళ్లూ వీరి వైపే… pic.twitter.com/Upw0TMFXcJ
— ChotaNews (@ChotaNewsTelugu) December 6, 2024