నాగార్జునసాగర్ వద్ద టెన్షన్.. టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు

-

నల్లగొండ: తెలంగాణలోని నాగార్జున పులిచింతల ప్రాజెక్టు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు ప్రాజెక్టుల వద్ద భద్రతను తెలంగాణ ప్రభుత్వం పటిష్టం చేసింది. ఈ రోజు నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్‌ల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలు భారీగా మోహరించారు. పోలీసు బలగాల మధ్యే నాగార్జున సాగర్,పులిచింతల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. నాగార్జున సాగర్ జలవిద్యుత్ ప్రధాన డ్యామ్ వద్ద ఎస్పీఎఫ్‌తో పాటు అదనంగా ప్రత్యేక భద్రతా దళాలతో భద్రత ఏర్పాటు చేశారు.

కాగా రాయలసీమ ఎత్తిపోతల నుంచి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీళ్లు తరలించుకుపోతోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కృష్ణా నదీ జలాల్లో తమకు అన్యాయం జరుగుతుందని అంటోంది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా తీవ్రంగానే స్పందించారు. ఒక్క చుక్క ఎక్కువ నీటిని కూడా తాము తీసుకోవడంలేదని చెబుతోంది. తెలంగాణ ప్రభుత్వమే ఎక్కువ నీటిని వినియోగించుకుంటుందని అంటోది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కృష్ణా నీటి యాజమాన్య బోర్డులకు లేఖలు రాశాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version