హ్యాండ్ బ్యాగ్ కొనడానికి వెళ్తున్నారా? అసలుకీ నకిలీకీ మధ్య తేడా తెలుసుకోండి.

-

మహిళలు చాలా ఇష్టపడే హ్యాండ్ బ్యాగ్ కూడా ఒకటి. బయటకి వెళ్తే మంచి హ్యాండ్ బ్యాగ్ చేతిలో ఉండడం స్టైలిష్ స్టేట్ మెంట్ గా భావిస్తారు. అందుకే ఖరీదైన హ్యామ్డ్ బ్యాగ్ తీసుకోవడంలో రాజీపడరు. స్టైలిష్ గా కనబడి, ఖరీదుగా ఉండే హ్యాండ్ బ్యాగుల్లో లెదర్ బ్యాగ్స్ ఒకటి. ఇవి చూడడానికి బాగుంటాయి. అలాగే ఖరీదు కూడా ఎక్కువ. ఐతే వీటిలో నకిలీ బ్యాగులు కూడా వచ్చాయి. అవి చూడడానికి లెదర్ బ్యాగుల మాదిరిగానే ఉండి, ఖరీదు తక్కువగా ఉంటుంది.

అలాంటివి తీసుకున్నవారు అవి తొందరగా పాడైతే మళ్ళీ మంచి హ్యాండ్ బ్యాగులు కొనడానికి మార్కెట్ కి వెళ్తున్నారు. ఇలాంటి వారు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఒరిజిన‌ల్ లెద‌ర్ న‌కిలీ లెద‌ర్ ల మ‌ద్య మొట్ట‌మొద‌టి తేడా ఎంటంటే.. లెద‌ర్ పశువులు, గేదె లేదా ఎద్దుల వంటి జంతువుల చ‌ర్మంతో త‌యారవుతుంది. లెద‌ర్ పేరుతో చ‌లామ‌ణీ అయ్యే న‌కిలీల‌ను ప్లాస్టిక్ బేస్ నుండి తయారు చేసి , లెద‌ర్ లా క‌నిపించ‌డానికి మైనపు, రంగు లేదా పాలియురేతేన్ వంటి కెమిక‌ల్స్‌ను వాడ‌తారు.

నిజమైన లెదర్

లెదర్ తో చేసిన బ్యాగులను చేతితో రుద్దినపుడు అది లేత ఎరుపు రంగుగా మారుతుంది. అలాగే నిజమైన లెదర్ తొందరగా వంగుతుంది. అదే నకిలీ లెదర్ ని వంచినపుడు దాని నుండి ఫైబర్ బయటకు వచ్చే అవకాశం ఉంది.

వాసన

నిజమైన లెదర్ ఒక చిత్రమైన వాసన కలిగి ఉంటుంది. లెద‌ర్ వాస‌న స్ప‌ష్టంగా గుర్తించ‌లేక‌పోయినా.. ప్లాస్టిక్ వాస‌నను గుర్తించ‌గలం కాబ‌ట్టి ఈజీగా వాస‌న ద్వారా కూడా తెలుసుకోవాచ్చు.న‌కిలీ లెద‌ర్ ప్లాస్టిక్ లేదా సింథటిక్ వాసన ఉంటుంది.

మెరిసే గుణం

నిజమైన లెదర్ కి మెరిసే గుణం ఉండదు. చాలా మంది ఇదే అనుకుంటారు. బాగా ఆకర్షించే బ్యాగులు నకిలీ లెదర్ వే అయ్యుంటాయి. నిజమైన లెదర్ పెద్దగా మెరవదు. నకిలీ వాటిని ప్లాస్టిక్ పదార్థాలతో కలిపి తయారు చేస్తారు కాబట్టి మెరిసినట్టు కనిపిస్తాయి.

వాట‌ర్ టెస్ట్

ఒరిజిన్ లెద‌ర్ కు న‌కిలీ లెద‌ర్ కు మ‌ద్య తేడా వాట‌ర్ టెస్ట్ ద్వారా గుర్తించ‌వ‌చ్చు. లెద‌ర్ పైన నీటి చుక్క లేదా ఏదైనా లిక్విడ్ వేసిన‌ప్పుడు లెద‌ర్ పీల్చుకుంటుంది. అదే న‌కిలీ లెద‌ర్‌పైన నీటిని కానీ ఏదైనా ద్ర‌వ ప‌దార్ధాల‌ను వేస్తే పీల్చుకోదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version