యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవురోజు కావడంతో భక్త జనులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, కొండపైన బస్ స్టాప్ తో పాటు ఆలయ తిరువీధులు, క్యూలైన్ల్ లు భక్తులతో కోలాహలంగా మారాయి.రధ్దీ పెరగడంతో ధర్మదర్శనం కోసం భక్తులకు నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనాలకు రెండు గంటలు సమయం పడుతోంది.
లడ్డు ప్రసాదం కౌంటర్లు, కల్యాణ కట్ట వద్ద కూడా భక్తుల కోలాహలం నెలకొంది. భక్తుల రద్దీని ముందే ఊహించిన ఆలయ సిబ్బంది భక్తలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. ఆలయ సిబ్బంది భక్తలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లు కూడా ఏర్పాటు చేశారు.