తెలంగాణ రాష్ట్రంలో పలు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నామని.. దానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలో కేపీహెచ్ బీ నుంచి కోకా పేట్ మీదుగా నార్సింగి వరకు ఎమ్మార్టీస్ మెట్రో నియో నెట్ వర్క్ పనులు ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రూ. 3,050 కోట్లు వరకు ఖర్చు అవుతుందని.. అందులో 15 శాతం వాటా కింద రూ. 450 కోట్లు మంజూరు చేయాలని కోరారు.
వరంగల్ మెట్రో నియో ప్రాజెక్టు వ్యయంలో 20 శాతం కింద రూ. 184 కోట్లు నిధులు ఇవ్వాలని కోరారు. అలాగే హైదరాబాద్ పరిసరాల్లో 104 మిస్సింగ్ లింక్ రోడ్డ కారిడార్లు కోసం కావాల్సిన రూ. 2,400 కోట్లల్లో మూడో వంతు కింద రూ. 800 కోట్లు ఇవ్వాలని కోరారు. ప్యారడైస్ సెంటర్ నుంచి షామీర్ పేట్ ఓఆర్ఆర్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్లకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మూసీ నది వెంట ఇరువైపుల అనుసంధానం తో పాటు స్కై వేలతో మొత్తం రూ. 1,500 అవుతుందని అన్నారు.
దీనిలో కొంత వాటా గా నిధులు ఇవ్వాలని కోరారు. ఎస్సార్డీపీ రెండో దశకు రూ. 14 వేల కోట్లు ఖర్చు అవుతాయని అందులో కూడా కేంద్రం సాయం చేయాలని అన్నారు. అలాగే మరి కొన్ని ప్రాజెక్టులను ప్రస్తావిస్తు.. నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ని కోరారు. అయితే త్వరలో వస్తున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరారు.