రాష్ట్రంలో ఐఏఎస్‌లకు బ‌దిలీలు, పోస్టింగులు

-

రాష్ట్రంలో పలువురి ఐఏఎస్ ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు వెయిటింగ్ లో ఉన్న ఐఏఎస్ ల‌కు పోస్టింగులను కూడా ఇచ్చింది. బ‌దిలీలు, పోస్టింగుల‌కు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌శు సంవ‌ర్థ‌క శాఖ కార్య‌ద‌ర్శిగా ఉన్న అనితా రాజేంద్ర‌ను మ‌ర్రి చెన్నా రెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి కేంద్రానికి బ‌దిలీ చేశారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీఐ డైరెక్ట‌ర్ జ‌న‌రల్ గా అద‌న‌పు బాధ్య‌త‌ల నుంచి హ‌ర్ ప్రీత్ సింగ్ ను రిలీవ్ చేశారు.

ఈ అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను అనితా రాజేంద్ర‌కు అప్ప‌గించారు. అలాగే ఈపీటీఆర్ఐ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ గా ఉన్న అద‌ర్ సిన్హా ను ప‌శుసంవ‌ర్థ‌క శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బ‌దిలీ చేశారు. వీరితో పాటు వాణి ప్ర‌సాద్ ను ఈపీటీఆర్ఐ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ గా నియ‌మించింది. అలాగే నిర్మ‌ల‌ను ప్ర‌భుత్వం రంగ సంస్థ‌ల శాఖ కార్య‌ద‌ర్శి గా రాష్ట్ర ప్ర‌భుత్వం పోస్టింగ్ ఇచ్చింది. వీరి తో పాటు మానిక్క రాజ్ ను విప‌త్త నిర్వ‌హ‌ణ శాఖ కార్య‌ద‌ర్శిగా నియ‌మించింది. పౌసుమి బ‌సు, శ్రుతి ఓజాలను జీహెచ్ఎంసీ అద‌న‌పు క‌మిష‌న‌ర్లుగా నియ‌మించింది. హ‌రిత ను విద్యాశాఖ ఉప‌కార్య‌ద‌ర్శిగా పోస్టింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version