చంద్రబాబు కి సరికొత్త ఊపిరి ? రానున్న రోజులు ఎలా ఉండనున్నాయి ?

-

సరిగ్గా 2019 వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 80 శాతం ఓటింగ్ నమోదైంది. జనాలు అర్ధరాత్రి వరకు ఓట్లు వేయడం జరిగింది. దీంతో అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కచ్చితంగా తిరిగి తామే అధికారంలోకి వస్తామని చెపుతుంటే మరో పక్క విపక్షంలో ఉన్న వైసిపి చంద్రబాబు ప్రభుత్వం పై వ్యతిరేకత చాలా బలంగా ఉందని అన్నారు. అందుకే ఈ స్థాయిలో ఓటింగ్ జరిగినట్లు వ్యాఖ్యానించారు. మే నెలలో ఫలితాలు వచ్చాయి జగన్ భారీ మెజార్టీతో అధికారంలోకి రాగా తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. దీంతో వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే ఇక తెలుగుదేశం పార్టీ కోలుకునే ప్రసక్తి లేదు అని చాలామంది రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.కాగా ఎన్నికలు జరిగి సరిగ్గా సంవత్సరం అయిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మళ్లీ భవిష్యత్ ఉందని ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించడం గమనార్హం. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన జగన్ పరిపాలన పట్ల ప్రారంభం లో ప్రజలు అనేక అంచనాలు పెట్టుకోవడం జరిగింది. కానీ ఆయన ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాలు వ్యవహరిస్తున్న మొండివైఖరి ఏపీ జనాల్లో అసంతృప్తి కలిగిస్తునట్లు వార్తలు వస్తున్నాయి. పాలనాపరంగా తడబాట్లు, పొరపాట్లు చేస్తూనే మరో పక్క న్యాయస్థానాల దగ్గర మొట్టికాయలు అనేక నిర్ణయాలలో వేయించుకోవటం తో జగన్ పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కొంత నిరుత్సాహం గానే ఉన్నట్లు ప్రస్తుత పరిణామాల పట్ల చాలామంది అంటున్నారు.

 

ప్రతి విషయంలో ప్రజల భద్రతను పక్కనపెట్టి రాజకీయంగానే జగన్ ఆలోచిస్తున్నారని చాలామంది అంటున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న టైంలో కూడా ఎన్నికల గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది వైయస్ జగన్ అని దీన్నిబట్టే చెప్పవచ్చు ఆయన పరిపాలన ఏ స్థాయిలో ఉంది అని అంటున్నారు. మరోపక్క ఇదే టైమ్ లో గత ప్రభుత్వం చంద్రబాబు ఉన్నప్పుడు బాగానే ఉందని ప్రజలు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంమీద చూసుకుంటే  జగన్ అనుభవ రాహిత్యం, తొందరపాటుతనం, ఆవేశపూరితమైన నిర్ణయాల కారణంగా చంద్రబాబుకు కొత్త ఊపిరి ఊరట భవిష్యత్తులో దొరకటం గ్యారెంటీ అని, రాబోయే రోజుల్లో టిడిపి మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version