అమెరికాను నాశ‌నం చేసేందుకే క‌రోనా వైర‌స్ జీవాయుధాన్ని సృష్టించిన చైనా..?

-

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా సృష్టిస్తున్న భీభ‌త్సం అంతా ఇంతా కాదు. ఇప్ప‌టికే ఎన్నో ల‌క్ష‌ల మందికి పైగా క‌రోనా బారిన ప‌డ‌గా, ఎంతో మంది ఈ వైర‌స్ ధాటికి బ‌ల‌య్యారు. ఇక రోజు రోజుకీ క‌రోనా కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతోంది. అయితే క‌రోనా వైర‌స్‌ను చైనాయే సృష్టించింద‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచంలోని అంద‌రూ చైనాను వేలెత్తి చూపిస్తూ వ‌చ్చారు. కానీ.. అదే కాదు.. నిజానికి అస‌లు ఆ వైర‌స్‌ను అమెరికాను నాశ‌నం చేసేందుకే చైనా సృష్టించింద‌ని.. ఇప్పుడు కొంద‌రు వాదిస్తున్నారు.

చైనాలోని వూహాన్ న‌గ‌రంలో మొద‌ట‌గా క‌రోనా వైర‌స్ ఉద్భ‌వించింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. జ‌నాలంద‌రూ అదే నిజ‌మ‌ని న‌మ్ముతున్నారు. అయితే ఈ విష‌యంలో చైనా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు కూడా మొద‌టి నుంచీ అనుమానంగానే ఉంది. వైర‌స్ గురించి మొద‌ట తెలిసినా.. ఆ విష‌యాన్ని చైనా దాచి పెట్టింద‌ని, ఈ క్ర‌మంలో ఆ వైర‌స్ పెద్ద ఎత్తున జ‌నాల‌కు వ్యాప్తి చెందింద‌ని తెలుస్తోంది. అయితే వూహాన్ లోని వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీలో అస‌లు ఎలాంటి సేఫ్టీ ప్రికాష‌న్స్ తీసుకోకుండానే గ‌బ్బిలాల్లో ఉండే క‌రోనా వైర‌స్‌పై ప్ర‌యోగాలు చేశార‌ట‌. ఆ త‌రువాత ఆ వైర‌స్ ఆ ల్యాబ్‌కు చెందిన ఒక‌రికి వ్యాప్తి అయ్యాక‌.. ఆ వ్య‌క్తి అక్క‌డికి స‌మీపంలోని వెట్ మార్కెట్‌లో తిరిగి వైర‌స్‌ను అంద‌రికీ అంటించాడ‌ట‌. అలా అలా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందింద‌ట‌.

ఇక చైనాలో వైర‌స్ విష‌యాన్ని ముందుగానే క‌నిపెట్టినా బ‌య‌టి ప్ర‌పంచానికి చైనా ఆ విష‌యాన్ని కావాల‌నే చెప్ప‌లేద‌ని, ఈ క్ర‌మంలో చైనా.. అమెరికాను నాశ‌నం చేసేందుకు వ‌దిలిన జీవాయుధ‌మే క‌రోనా వైర‌స్ అని ప‌లు మీడియా సంస్థ‌లు క‌థ‌నాల‌ను రాస్తున్నాయి. అయితే వైర‌స్ ప్ర‌భావం ఉంద‌ని తెలిసిన‌ప్ప‌టికీ చైనా వూహాన్ న‌గ‌రంలో పెద్ద ఎత్తున స‌భ‌లు, స‌మావేశాలు, ఉత్స‌వాల‌ను జ‌ర‌గ‌నివ్వ‌డం.. అంర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను నిలిపివేయ‌క‌పోవ‌డం.. వంటి అంశాల‌ను ప‌రిశీలిస్తుంటే.. చైనా కావాల‌నే ఆ వైర‌స్‌ను బ‌య‌టి ప్ర‌పంచం మీద‌కు వ‌దిలింద‌ని అనిపిస్తుంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. అయితే నిజం ఎన్న‌టికీ దాగ‌దు క‌దా.. ఈ విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త సీరియ‌స్‌గానే ఉన్నారు. చైనాలో అస‌లు ఏం జ‌రిగింది..? అని కూపీ లాగే ప‌నిలో ఉన్నారు. క‌నుక ఎప్ప‌టికైనా నిజాలు బ‌య‌ట ప‌డ‌క త‌ప్ప‌దు. ఒక వేళ చైనా దోషి అని తేలితే.. అందుకు త‌గ్గ శిక్ష అనుభ‌వించ‌క త‌ప్ప‌దు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version