నాటు నాటు పాటకు కాలు కదిపిన జీ20కి హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు..

-

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మనసుల్లో ‘నాటు’కు పోయిన ‘నాటు నాటు’ ప్రతిష్ఠాత్మక జీ20 సమావేశాలనూ తాకింది. ఎంఎం కీరవాణి ఏ సందర్భంలో బీటు కొట్టాడో కానీ.. ‘నాటు నాటు’ పాటకు ఇంకా క్రేజ్ పెరుగుతునే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మనసుల్లో ‘నాటు’కుపోయింది. ఆ మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం భారత దేశం అధ్యక్షతన జీ20 సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో ‘అగ్రికల్చర్ డిప్యూటీస్ మీటింగ్ (ఏడీఎం) ఆఫ్ అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్’ సమావేశం చండీగఢ్ లో జరిగింది. ఈ భేటీకి హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు.. నాటు నాటు పాటకు కాలు కదిపారు.

స్థానిక కళాకారులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఏఎన్ఐ ట్వీట్ చేసింది. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. బాహుబలితో పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తో పాన్ వరల్డ్ డైరెక్టర్ అయ్యారు. పనిలోపనిగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లను గ్లోబల్ స్టార్లను చేశారు. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ తో తెలుగు సినీ ఖ్యాతిని విశ్వవ్యాప్తంచేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ ఇటు కలెక్షన్ల వర్షం.. అటు అవార్డుల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version