బెల్లంకొండ శ్రీనివాస్ “చత్రపతి” టీజర్ రిలీజ్

-

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చత్రపతి రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న చత్రపతి తో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండరీ కమెడియన్ జానీ లివర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ భామ నుస్రత్ బరూచ ఫిమేల్ లీడ్ లో నటిస్తోంది.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అయితే శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. నిమిషం పాటు ఉన్న ఈ టీజర్ ని ఫుల్ యాక్షన్ సీన్స్ తో కట్ చేశారు. తెలుగు వెర్షన్ కు ఏమాత్రం తగ్గకుండా కట్ చేసిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version