భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్న విశాఖ పోలీసులు …!

-

ఒకవైపు కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే మరోవైపు స్మగ్లర్లు వారి పని వారు చేసుకుంటూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. గత కొద్ది రోజులుగా విశాఖ మన్యం ప్రాంతంలో గంజాయి కి సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో విశాఖ పోలీసులు గంజాయి స్మగ్లర్లపై కన్నెర్ర చేయడంతో రోజూ ఏదో ఒక చోట గంజాయి ముఠా సభ్యులు పోలీసులకు దొరుకుతున్నారు. ముఖ్యంగా ఈ గంజాయి విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి ఎగుమతి అవుతున్నట్లు వారు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పక్కా ప్లాన్ వేసి ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో గంజాయి స్మగ్లర్లకు చెక్ పెడుతున్నారు.

ganja

ఇదే నేపథ్యంలోనే తాజాగా విశాఖ జిల్లా పోలీసులకు గోలుగొండ మండలం లింగంపేట వద్ద గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. రోజు మాదిరిగా పోలీసులు చేస్తున్న తనిఖీలతో ఏకంగా 1200 కిలోల గంజాయిని పట్టుకోవడంతో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పోలీసుల బారి నుండి తప్పించుకొని పారిపోయారు. గంజాయిని తరలిస్తున్న లారీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయి విలువ 60 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version