సన్ రైజర్స్ హైదరాబాద్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయిన తర్వాత కెప్టెన్ కోహ్లీపై అటు బెంగళూరు ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ కూడా ఆర్ సీ బీ పై ఘాటైన వ్యాఖ్యలు చేసాడు. అసలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ప్లే ఆఫ్స్ కి వెళ్ళే అర్హతే లేదనడం అందరికీ షాకిచ్చింది. గంభీర్ మాట్లాడుతూ, రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్ళు అనుకోకుండా ప్లే ఆఫ్స్ కి వెళ్ళారని, కానీ అక్కడ కూడా వాళ్ళు నిలబడలేకపోయారని అన్నాడు.
ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచులో సూపర్ ఓవర్లో నవ్ దీప్ సైని అద్భుతమైన బౌలింగ్ చేయడంతో ప్లే ఆఫ్స్ లోకి వెళ్ళారని అన్నాడు. లేదంటే ఆర్ సీ బీ జట్టు ప్లే ఆఫ్స్ లోకి వెళ్లే అవకాశమే లేదని తెలిపాడు. 2016 నుండి ఇప్పటి వరకూ ప్లే ఆఫ్ చేరుకోలేని జట్టు, ఈ సంవత్సరం చేరినప్పటికీ సరిగ్గా వినియోగించుకోలేరని అన్నాడు.