ఘుమఘుమలాడే గోంగూర మటన్ త‌యారు చేద్దామా?

-

గోంగూర మటన్.. తెలంగాణలో ఈ వంటకం గురించి ఎక్కువగా తెలియక పోవచ్చు గానీ.. ఆంధ్రాలో ముఖ్యంగా గుంటూరు ప్రాంతం వాళ్లు గోంగూర మటన్ ను ఎంతో ఇష్టంగా తింటారు. రుచి కూడా సూపర్బ్ గా ఉంటుంది. మరి.. అద్భుతమైన రుచి ఉండే… గోంగూర మటన్ ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రెష్ మటన్, గోంగూర, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నూనె, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు.. ఇవి ఉంటే చాలు గోంగూర మటన్ ను వండేయొచ్చు.

ముందుగా కుక్కర్ తీసుకోండి. కుక్కర్ లో శుభ్రంగా కడిగిన మటన్ ముక్కలను వేసి… దాంట్లో కారం, ధన్యాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు వేయండి. కొన్ని నీళ్లు పోసి మూడు నాలుగు విజిల్స్ వచ్చే దాకా ఉడికించండి. తర్వాత ఓ గిన్నె తీసుకొని.. దాంట్లో ఇంత నూనె పోసి… నూనె వేడెక్కాక చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా వేయండి. బాగా వేయించండి. అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తరిగిన పచ్చి మిర్చి ముక్కలు, గోంగూర వేసి బాగా కలపండి. కాసేపు మంట మీద ఉడికించండి. తర్వాత ముందే ఉడకబెట్టిన మటన్ ను ఆ మిశ్రమంలో వేయండి. కొంచెం ఉప్పు వేసి మరికొంత సేపు ఉడికించండి. అంతే.. వేడి వేడి గోంగూర మటన్ రెడీ. ఏంచక్కా.. రోటీలో లేదంటే అన్నంలో కలుపుకొని లాగించేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version