మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న గేమ్ ఛేంజర్ టీజర్..!

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో ఈ సినిమా రాబోతోంది. షూటింగ్ మొత్తం పూర్తి కాలేదు అయితే ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తప్ప మరో అప్డేట్ అయితే రాలేదు. దీంతో ఈ సినిమా గురించి ఏదో ఒకటి విడుదల చేయాలని సోషల్ మీడియాలో నిత్యం మెగా ఫాన్స్ అడుగుతూనే ఉన్నారు.

అయితే ఎట్టకేలకి మెగా ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతోంది చిత్ర యూనిట్ మార్చి 27న రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తొందరలో అధికారిక ప్రకటన కూడా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఒకవేళ కనుక ఇది వచ్చిందంటే మెగా ఫ్యాన్స్ కి పండగే.

Read more RELATED
Recommended to you

Latest news