గాంధీ బాపు, మ‌హాత్మ‌గా మారిన వైనం…

-

సూర్యుడు అస్త‌మించ‌ని సామ్రాజ్యానికి ప‌డ‌మ‌టి దారిని చూపిన క్రాంతి.. తూర్పు తెల్లార‌ని న‌డి రాత్రికి స్వే చ్ఛా భానుడి ప్ర‌భాత కాంతి గాంధీ.. మ‌హాత్ముడికి తెలిసిందే ఒక్క‌టే ఎక్క‌డ వివ‌క్ష ఉన్నా..దానికి వ్య‌తిరేకంగా పోరాడ‌టం.. స‌త్యం, అహింస‌ల కోసం ప్రాణాల‌ను కూడా లెక్క‌చేయ‌క‌పోవ‌డం. ఒక్కో చినుకు గాలివాన‌గా మారిన‌ట్లు… ఆయ‌న ఒక్కో అడుగు బ్రిటిష్ సామ్రాజ్య‌వాద కోట‌ల‌ను బీట‌లు వారేలా చేసింది. ర‌వి అస్త‌మించ‌ని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గ‌డ‌గ‌డ‌లాడించింది.

గోపాల కృష్ణ గోఖ‌లే.. గాంధీజీకి రాజ‌కీయ గురువు. ఆయ‌నే గాంధీకి భార‌త రాజ‌కీయాలు, స‌మ‌స్య‌ల‌ను ప‌రిచ‌య‌డం చేశాడు. ఆయ‌న స్ఫూర్తితోనే గాంధీజీ భార‌త‌దేశ స్వాంతంత్రోద్య‌మంలో అడుగుపెట్టాడు. ఈక్ర‌మంలోనే స‌ర్ధార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ గాంధీజీకి కుడి భుజంగా నిలిచారు. 1918లో చంపార‌న్‌, ఖేడా ఉద్య‌మాల‌కు నాయ‌క‌త్వం వ‌హించాడు. గాంధీజీ నాయ‌క‌త్వంలో వేలాది ప్ర‌జ‌లు బ్రిటిష్‌వారికి వ్య‌తిరేకంగా పోరాడి , జైళ్ల‌కు సైతం వెళ్లారు.

ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌లు బాపూ అని మ‌హాత్మా అని గౌర‌వంగా పిలిచేవారు.ఏప్రిల్ 13, 1919లో పంజాబ్‌లోని జ‌లియ‌న్‌వాలా బాగ్ ఉదంతం గాంధీజీలో స్వ‌రాజ్య కాంక్ష‌ను మ‌రింత ర‌గిల్చింది. ఈ క్ర‌మంలోనే అహింసా, స‌హాయ నిరాక‌ర‌ణ వంటి అంశాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లి.. స్వ‌దేశీ ఉద్ య‌మానికి నాయ‌క‌త్వం వ‌హించాడు. ఈ ఉద్య‌మంలో మ‌హిళ‌లు కూడా పెద్ద ఎత్తున భాగ‌స్వామ్యం అ య్యారు. ఆ త‌ర్వాత స‌హాయ నిరాక‌ర‌ణ‌, స‌మాజ దురాచార నిర్మూల‌న‌కు కృషి చేశారు.

ఈక్ర‌మంలోనే 1930 మార్చిలో ఉప్పు స‌త్యాగ్ర‌హానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉప్పు స‌త్యాగ్ర‌హం, క్విట్ ఇండియా ఉద్య‌మాలు భార‌త స్వాతంత్ర్య ఉద్య‌మంలో ముఖ్య‌మైన , చివ‌రి ఘ‌ట్టాలు. ఈక్ర‌మంలోనే 1947 ఆగ‌స్టు 15న బ్రిటీష్ పాల‌కుల నుంచి దేశానికి స్వాంతంత్య్రం ల‌భించింది. అహింసా మార్గంలో ల‌క్ష‌లాది మందిని క‌దిలించి, దేశానికి స్వాంతంత్య్రం తీసుకొచ్చారు గాంధీజీ.. గాంధీజీ మ‌ర‌ణించి ఏడు ద‌శాబ్దాలు గ‌డిచినా.. ఆయ‌న ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version