దైవ దర్శనానికి వచ్చిన యువతిపై గ్యాంగ్ రేప్.. ఎక్కడంటే?

-

తెలంగాణలో మరో గ్యాంగ్ రేప్ జరిగింది. ఆ మధ్యలో ఇటువంటి దారుణం ఒకటి వెలుగుచూడగా.. తాజాగా ఊర్కొండపేట ఆంజనేయస్వామి వద్దకు రాత్రి నిద్ర కోసం వచ్చిన యువతిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

నాగర్ కర్నూలు జిల్లాలోని ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలోనే యువతిపై 8 మంది యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. అమ్మాయి వెంట వచ్చిన బంధువుపై దాడి చేసిన నిందితులు అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది.బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసలు కేసు నమోదు చేసి  ఆరుగురిని అదుపులోకి తీసుకోగా.. ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news