ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ప్రపంచ శాంతి పేరిట జీవసమాధికి ప్రయత్నించాడు. తనకు తానే అయిదు అడుగుల మేర గుంట తీసుకుని, ఒంటిపై బట్టలు లేకుండా కైపు కోటిరెడ్డి అనే వ్యక్తి సమాధిలోకి వెళ్లాడు. విషయం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కోటిరెడ్డిని సమాధి నుంచి బయటకు తీశారు.
తన పేరు భూదేవి పుత్రుడని, ప్రపంచ శాంతి కోసమే జీవ సమాధి దీక్ష చేపట్టినట్లు కోటిరెడ్డి చెప్పడం ఆసక్తికరంగా మారింది.ఈ ఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో సోమవారంఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. కాగా, కోటిరెడ్డి జీవసమాధిలోకి వెళ్తున్నట్లు వీడియో తీయడంతో ఈ మేరకు పోలీసులు అతన్ని రక్షించినట్లు సమాచారం.
జీవ సమాధికి ప్రయత్నించిన వ్యక్తి
అయిదు అడుగుల మేర గుంట తీసుకుని, ఒంటిపై బట్టలు లేకుండా సమాధిలోకి వెళ్లిన కైపు కోటిరెడ్డి
విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకుని కోటిరెడ్డిని సమాధి నుంచి బయటకు తీసిన పోలీసులు
తన పేరు భూదేవి పుత్రుడని, ప్రపంచ శాంతి కోసమే జీవ సమాధి దీక్ష చేపట్టినట్లు… pic.twitter.com/IG0cQR3NsW
— BIG TV Breaking News (@bigtvtelugu) March 31, 2025