నిజామాబాద్ లో దారుణం.. దళిత మహిళ పై గ్యాంగ్ రేప్.. బర్త్ డే పార్టీ పేరుతో!

-

రోజు రోజు కు మహిళల పై లైంగిక దాడులు పెరిగి పోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వచ్చినా… మహిళ లపై లైంగిక దాడులు ఆగడం లేదు. అసలు ఇండియా లో మహిళలకు భద్రత ఉందా ? అనే ప్రశ్న తలెత్తక మానదు. మహిళలపై మానవ మృగాల వలె.. అత్యా చారాలకు పాల్పడుతున్నారు కొందరు దుర్మార్గులు. ఇక తాజాగా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

నిజామాబాద్ కు చెందిన ఓ దళిత యువతీ పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు దుర్మార్గులు. మద్యం తాగించి మరీ రేప్ చేశారు దుండగులు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… నిజామాబాద్ జిల్లా లోని ఆర్మూరు పట్టణానికి చెందిన ఓ దళిత మహిళ… ఫేస్బుక్ ద్వారా నిజామాబాద్ కు చెందిన శేఖర్, నవీన్ మరియు కరీం లకు పరిచయమైంది. ఆ పరిచయం కాస్త చనువుగా మారింది.

ఈ నేపథ్యంలోనే బర్త్ డే పార్టీ కోసం నిజామాబాద్ కు రావాలని ఆ యువతిని కోరారు ఈ ముగ్గురు యువకులు. దీంతో వారి మాటలు నమ్మి నా దళిత యువతి… నిన్న నిజామాబాద్ కు చేరుకుంది. ఈ తరుణంలోనే బర్త్డే పార్టీ పేరుతో ఆ యువతికి తాగించారు యువకులు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు యువకులు. మద్యం నుంచి తేరుకున్న ఆ యువతి నేరుగా వెళ్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇద్దరు యువకులను అరెస్టు చేసిన పోలీసులు మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version