గ్యాంగ్ స్టర్ నయీం అనుచరుడు శేషన్నను అరెస్ట్ చేశాం – డీసీపీ జోయోల్

-

గ్యాంగ్ స్టర్ నయీం అనుచరుడు శేషన్నను అరెస్ట్ చేశామని వెస్ట్‌జోన్ డీసీపీ జోయోల్ ప్రకటించారు. శేషన్న అరెస్టును అధికారికంగా ప్రకటించిన వెస్ట్‌జోన్ డీసీపీ జోయోల్… బెదిరింపులు, హత్యలకు శేషన్న పాల్పడ్డాడని వివరించారు. శేషన్నపై ఇప్పటి వరకు 9 కేసులను గుర్తించామని.. నయీమ్ ఎన్‌కౌంటర్ తరువాత అండర్ గ్రౌండ్‌కు శేషన్న వెళ్లిపోయాడని తెలిపారు.

కొన్నాళ్ల నుంచి శేషన్న ల్యాండ్ సెటిల్‌మెంట్లు అక్రమ దందాలను చేస్తున్నాడని.. హుమయూన్‌నగర్‌లో ఆయుధాల కేసులో అరెస్టు చేశామన్నారు వెస్ట్‌జోన్ డీసీపీ. కాగా.. మొదట నయీం ప్రధాన అనుచరుడు శెషన్న ను అరెస్ట్ చేశారు గోల్కొండ పోలిసులు.

అనంతరం.. శేషన్న పై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నానక్ రాoగూడ నుండి గచ్చిబౌలి వెళుతున్న శేషన్న ను అదుపులోకి తీసుకున్న పోలిసులు… శేషన్న పై వివిధ పోలీస్ స్టేషన్ లలో 9 కేసులు నమోదు చేశారు. 1993లో శేషన్నను మొదటిసారి ఆరేస్ట్ చేసిన సనత్ నగర్ పోలీసులు.. శేషన్న వద్ద నుండి 9 ఎంఎం పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version