బీజేపీ నేత మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై తెలంగాణ మంత్రులు ఫైర్ అవుతున్నారు. నిన్న శివరాజ్ సింగ్ చౌహన్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పలు విమర్శలు చేశారు. కేసీఆర్ భయపడుతున్నారని.. ఇంతవరకు పిరికి సీఎంను చూడ లేదని అని విమర్శించారు.
తాజాగా ఈ విమర్శలపై తెలంగాణ మంత్రులు ఫైర్ అవుతున్నారు. కేసీఆర్ పిలుపు ఇస్తే భయమెంటో శివరాజ్ సింగ్ చౌహన్ కు చూపించేవాళ్లమని గంగులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మేం అనుకుంటే నువ్వు ఫ్లైట్ కూడా దిగకపోయేవాడివని అన్నారు. కాంగ్రెస్ పార్టీని చీల్చి, ఎమ్మెల్యేలను కొనుక్కుని ముఖ్యమంత్రివి అయ్యావని గంగుల కమలాకర్ విమర్శించారు. బీజేపీ నేతలకు మతి భ్రమించిందని ఆయన అన్నారు.