బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి హార్ట్ ఎటాక్ రావడంతో కోల్‌కతాలో ఆయన ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం విదితమే. కాగా గంగూలీకి మొత్తం 3 రక్త నాళాల్లో బ్లాక్స్ ఏర్పడ్డాయి. దీంతో ఒక బ్లాక్‌లో వైద్యులు స్టెంట్ వేశారు. మిగిలిన రెండు నాళాలకు చికిత్స విషయమై వైద్యులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ ప్రస్తుతం అతను బాగానే ఉన్నాడని, బుధవారం అతన్ని డిశ్చార్జి చేస్తున్నామని వైద్యులు తెలిపారు.
అయితే అందరు క్రికెటర్లు చేసినట్లుగానే గంగూలీ కూడా గతంలో పలు కంపెనీలకు చెందిన ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. అందులో భాగంగానే అదాని గ్రూప్‌కు చెందిన ఫార్చూన్ హార్ట్ హెల్దీ ఆయిల్‌కు గంగూలీ గతంలో ప్రచార కర్తగా చేశాడు. అందుకు గాను అతను ఆయిల్‌కు చెందిన కొన్ని యాడ్‌లలో నటించాడు. అయితే గంగూలీకి హార్ట్ ఎటాక్ రావడంతో ఆ ఆయిల్ కంపెనీని దారుణంగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
Sourav Ganguly undergoes angioplasty after suffering a heart attack even using adani fortune oil.
😜😆😆 pic.twitter.com/CWvUwZ9OaH— Prashanth KB (@PrashanthKB8) January 3, 2021
Remembering the ad, “40 ke ho gye to kya jeena chhod doge”, I wonder the condition of the brand manager of Fortune Rice Bran Oil. Get well soon dada! @SGanguly99 #Dada #Ganguly
Link of Ad:https://t.co/KC0Gxt3AoZ— abhinav pathak ⏳📚 (@abhinavdiaries) January 2, 2021
Seen many tweets on the irony in Sourav Ganguly endorsing Fortune RiceBran Oil. Got to realise it’s the risk one takes in any endorsement. It isn’t that Ganguly lived an unhealthy lifestyle. Importantly, sportsmen with a 10-15 year playing life need to keep the earnings coming in
— Lloyd Mathias (@LloydMathias) January 3, 2021
గంగూలీ ఆ ఆయిల్ వాడడం వల్లనే అతనికి హార్ట్ ఎటాక్ వచ్చిందని, అలాంటి బ్రాండ్లను ప్రమోట్ చేయవద్దని.. రక రకాలుగా నెటిజన్లు అదానీ గ్రూప్‌ను విమర్శించడం మొదలు పెట్టారు. దీంతో ఆ బాధ తట్టుకోలేక ఆ కంపెనీ గంగూలీ నటించిన యాడ్స్ ను పూర్తిగా తన మాధ్యమాల నుంచి తొలగించింది. అయితే ఇదేం కొత్త కాదు, ఇటీవలే గంగూలీపై ఓ యాప్ విషయంలో విమర్శలు వచ్చాయి. ఫాంటసీ క్రికెట్ యాప్‌కు గంగూలీ ప్రచార కర్తగా ఉండడంతో అందరూ అతన్ని విమర్శించారు. అలాంటి యాప్‌లలో డబ్బులు పెట్టి పెద్ద ఎత్తున అనేక మంది నష్టపోయారని, కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని, అలాంటప్పుడు గంగూలీ లాంటి సెలబ్రిటీలు అలాంటి యాప్‌లను విలువలు లేకుండా ఎలా ప్రమోట్ చేస్తారని.. గతంలో విమర్శలు వచ్చాయి. వాటికి గంగూలీ స్పందిస్తూ.. అది తన వ్యక్తిగతమని బదులిచ్చాడు. మరి ఇప్పుడు ఈ విషయాలకు అతను ఏమని సమాధానం చెబుతాడో చూడాలి.