టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిన్న సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ మేరకు తన సోషల్ మీడియాలో… ఓ పోస్ట్ కూడా చేశారు. ఇటీవలే…. వన్డే, టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ… టెస్ట్ కెప్టెన్సీ కూడా గుడ్ బై చెప్పడం అందరినీ షాక్ గురి చేసింది.
అయితే.. తాజాగా విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఎన్నో ఘనతలు సాధించిందని పేర్కొన్నాడు. ” విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లో టీమిండియా అన్ని ఫార్మాట్లలో మెరుగ్గా రాణించింది. సారథిగా తప్పుకోవడం కోహ్లీ వ్యక్తిగత నిర్ణయం. బీసీసీఐ ఈ నిర్ణయాన్ని గౌరవిస్తుంది. భవిష్యత్తులో ఓ ఆటగాడిగా కోహ్లీ… జట్టు కోసం మరెన్నో ఘనతలు సాధించాలని. అతడో గొప్ప ప్లేయర్” అంటూ గంగూలీ కామెంట్ చేశారు.