కాటారం పోలీస్ సబ్ డివిజన్ పరిధి గంగారంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్దఎత్తున కోడి పందాలు ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు SIశ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. పోలీసుల దాడులతో అప్రమత్తమైన పలువురు పందెంరాయుళ్లు పరారయ్యారు. ఘటనా స్థలంలో 4కోళ్ళతో పాటు పలు బైకులను స్వాధీనం చేసుకున్నామని, పూర్తిస్థాయిలో నిందితుల వేట కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.