బీజేపీ, జనసేన మధ్య గ్యాప్…?

-

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్తగా పొత్తు కుదుర్చుకున్న బీజేపీ, జనసేన పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఎవరెవరు ఎన్ని సీట్లు పోటీచేయాలని, ఇంకా ఏ సీట్లకు ఎవరు పోటీ చేయాలనే విషయం పట్ల రెండు పార్టీల నేతలు సమావేశమై చర్చించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దియోధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కలిసి చర్చలు జరిపారు.

ఈ నెల 8న విజయవాడలో విస్తృత స్థాయిలో మరోసారి చర్చలు జరుపుతామన్నారు. ఈ నెల 12న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తాం అని నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుంది అని తాము చూస్తూ ఊరుకోం అని, సరైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ప్రజల పక్షాన ఉంటాం అని భేటీ తర్వాత నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. అయితే జనసేన బిజెపి మధ్య అప్పుడే విభేదాలు వచ్చాయి అనే ప్రచారం జరుగుతుంది.

రాజధాని విషయంలో రెండు పార్టీల మధ్య పెద్ద ఎత్తున విభేదాలు వచ్చాయని, పవన్ కళ్యాణ్ బిజెపి తో విభేదించారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు రద్దు అవుతుందని కూడా కామెంట్స్ వచ్చాయి. కాగా ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. మార్చ్ 29 తో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కానున్నాయి. దీనితో జనసేన బిజెపి కలిసి పోటీ చేస్తాయా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version