భారీగా తగ్గిన గ్యాస్ సిలెండర్…!

-

సబ్సిడీయేతర గ్యాస్ సిలెండర్ ధరలు భారీగా తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మధ్య కాలంలో ఎప్పుడు తగ్గని స్థాయిలో తగ్గించింది. రూ. 162.50 మేర తగ్గించింది. గత మూడు నెలల్లో రేట్లు తగ్గడం వరుసగా ఇది మూడవ సారి. గృహాసరాలకోసం తీసుకునే గ్యాస్ సిలెండర్లపై సబ్సిడీ వదులుకున్నవారికి కూడా ఇది వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. వారి కోటా ఏడాదికి 12 దాటితేనే ఇది వర్తిస్తుందని… 14.2కేజీల సిలెండర్‌పై ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది.

కరోనా నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. దీనితో గ్యాస్ సిలెండర్ ధరలు తగ్గాయి. తగ్గిన రేట్ల ప్రకారం చూస్తే ఢిల్లీలో 14.2 కేజీల గ్యాస్ సిలెండర్(సబ్సిడీయేతర) ధర రూ.581.50. ముంబైలో 579 రూపాయలుగా ఉంది. వాణిజ్య అవసరాల కోసం వాడే 19 కేజీల ఎల్‌పీజీ సిలెండర్ల ధరలు కూడా తగ్గాయి. 1,285 రూపాయల నుంచి రూ 1029.50కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version