ప్రతీ నెలా గ్యాస్ సిలెండర్ ధరలు మారుతూ ఉంటాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా గ్యాస్ సిలెండర్ ధరల్లో మార్పులు వచ్చాయి. సామాన్యులపై భారం పడనుంది. ఒకటో తేదీనే పెట్రోలియం సంస్థలు పెద్ద ఝలక్ ని ఇచ్చాయి. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… వంట గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించాయి.
ఈసారి గృహ వినియోగానికి ఉపయోగించే వంట గ్యాస్ ధరలు అలానే వాణిజ్య వినియోగానికి వాడే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగాయి. ఈ ధరలు ఈరోజు నుండి అమలులోకి వచ్చేసాయి. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 మేర పెరిగింది. 14.2 కేజీల డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ రేటు దేశ రాజధాని దిల్లీలో రూ. 1103కు చేరింది. అయితే ఇప్పటి దాకా 14.2 కేజీలకు రూ.1053గానే ఉండేది. ఫిబ్రవరి 28 వరకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.1105గా వుంది.
పెంచిన రేటు తో అది రూ.1155 అయింది. ఇదిలా ఉంటే ముంబయిలో రూ.1052.50 నుంచి రూ.1102.50కి పెరిగింది. కోల్‌కతాలో రూ. 1129 కి చేరింది. చెన్నై లో రూ.1118.50కి చేరింది. ఇక కమర్షియల్ సిలిండర్ ధర విషయానికి వస్తే… 19 కేజీల సిలెండర్ రూ.350.50 పెరిగింది. దానితో దిల్లీ లో వాణిజ్య సిలిండర్ రేటు రూ.2119.50కి చేరింది. ఇది వరకు రూ.1769 ఉండేది. కోల్‌కతాలో రూ.1870 నుంచి రూ.2221.50కి పెరిగింది. ముంబయిలో రూ.2071.50కి చేరింది. చెన్నైలో రూ.2268కి చేరింది.
మార్చి 1వ తేదీ అనగా నేటి నుండి ఇవి అమలులోకి వచ్చాయి.