ఎన్నికల కి ఇంకా కొద్దిరోజులు మాత్రమే ఉన్నాయి ఈ తరుణంలో కేంద్రం మధ్యంతర బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ మీద ప్రసంగిస్తున్న కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ జిడిపీకి కొత్త అర్ధం చెప్పారు. జిడిపి అంటే ప్రభుత్వం దృష్టిలో వేరే అర్థం ఉందని అది గవర్నమెంట్ డెవలప్మెంట్ పర్ఫామెన్స్ అని కొత్త అర్ధం చెప్పారు. అలానే దేశంలోని రైతులకి కూడా నిర్మల సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు.
రైతులకి కేంద్ర ప్రభుత్వం అండగా ఉందని మద్దతు ధర పెట్టుబడి సహాయంతో రైతుల్ని ఆదుకున్నామని చెప్పారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతని ప్రవేశపెట్టే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలని పెంచడానికి వివిధ పథకాలను తీసుకువస్తున్నట్లు కూడా చెప్పారు. డైరీ రైతుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు కూడా మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.