హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడు, టిఆర్ఎస్వీ ప్రస్థుత విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ప్రకటించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో ధీక్షతో పనిచేస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ టిఆర్ఎస్వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లుశ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో అరెస్టులయ్యి పలుమార్లు జైలుకెల్లారు. గెల్లు శ్రీనివాస్ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్దతను గుర్తించిన సిఎం కెసిఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇక అభ్యర్థి ప్రకటన తో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఓయూలో సంబరాలు మొదలైయ్యాయి.. ఓయూ విద్యార్థులు పటాసులు పేల్చి, స్వీట్ లు పంచుకొని సంబరాలు చేసుకుంటున్నారు. కాగా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా కారణంగా హుజురాబాద్ నియోజక వర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే.