Gentleman 2: ‘జెంటిల్‌మెన్2’ డైరెక్టర్ ఫిక్స్..మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్

-

ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ ఫస్ట్ పిక్చర్ ‘జెంటిల్ మెన్’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కుంజుమోన్ 30 ఏళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ తీస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే సీక్వెల్ పైన భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

gentleman 2

ఇక ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ ఒక్కొక్కటిగా ఇస్తూ సినిమాపైన అంచనాలను మరింత పెంచుతున్నారు నిర్మాత కుంజుమోన్. సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా మలయాళ ముద్దుగుమ్మ నయనతార చక్రవర్తి, సెకండ్ హీరోయిన్ గా ప్రియాలాల్ ను ఫైనల్ చేసిన ప్రొడ్యూసర్..తాజాగా డైరెక్టర్ ఎవరో చెప్పేశారు.

ఏ.గోకుల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. జెంటిల్ మెన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది. పాన్ ఇండియా వైడ్ గా ఈ సీక్వెల్ సినిమాను విడుదల చేయనున్నారు. ‘జెంటిల్ మెన్’ చిత్రానికి దర్శకత్వం వహించిన జీనియస్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో RC15 ఫిల్మ్ చేస్తున్నారు. ఈ పిక్చర్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version