పోస్ట్ ఆఫీస్ స్కీమ్.. రూ.95 డిపాజిట్‌తో రూ.14 లక్షలు..!

-

పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ని ఇస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో గ్రామ సుమంగల్ గ్రామీణ తపాలా జీవిత బీమా పథకం కూడా ఒకటి. కేవలం రూ.95 ఇన్వెస్ట్‌మెంట్‌తో మెచ్యూరిటీ సమయం లో కేవలం దాదాపు రూ. 14 లక్షలు వస్తాయి. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. ఈ పధకం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళ కోసం తీసుకు వచ్చారు. మనీ బ్యాక్ పాలసీ ఇది.

ఈ పాలసీ ని ఎవరు పొందొచ్చు..?

ఈ పాలసీ ని పొందాలంటే వయస్సు కనీసం 19 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
మెచ్యూరిటీపై బోనస్ కూడా వస్తుంది.
ఈ పాలసీని 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలకు కొనుగోలు చేయవచ్చు.
ఒకవేళ కనుక పెట్టుబడిదారు మరణిస్తే అతని నామినీ బోనస్‌ తో పాటు మొత్తం హామీ వస్తుంది.

ఎంత డబ్బులు వస్తాయి..?

25 సంవత్సరాల వయస్సులో వారు ఈ పథకంలో పెట్టుబడి పెడితే రూ. 7 లక్షల హామీతో 20 సంవత్సరాల మీరు కట్టాల్సి వుంది. ప్రతి నెలా కూడా రూ. 2853 పే చెయ్యాలి. రోజుకు రూ.95 పెడుతూ ఉంటే 6 నెలల్లో రూ.17,100 డిపాజిట్ చెయ్యాలి. అప్పుడు మెచ్యూరిటీపై దాదాపు రూ.14 లక్షలు వస్తాయి.

గ్రామీణ తపాలా జీవిత బీమా పథకం వలన కలిగే లాభాలు:

ఈ పాలసీ ని 15 ఏళ్లు నుంచి 20 ఏళ్ల కాల పరిమితితో తీసుకోవచ్చు.
15 ఏళ్ల టర్మ్‌తో పాలసీ తీసుకుంటే 6, 9, 12 పాలసీ టర్మ్స్‌లో 20 శాతం చొప్పున పొందొచ్చు.
40 శాతం డబ్బులు మెచ్యూరిటీ టైంలో మీకు లభిస్తాయి.
ఒకవేళ 20 ఏళ్ల కాల పరిమితితో పాలసీ తీసుకుంటే.. 8, 12, 16 ఏళ్లలో పాలసీ డబ్బులు 20 శాతం వస్తుంది. మిగతా 40 శాతం డబ్బులు మెచ్యూరిటీ సమయంలో వస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version