చాల మంది భవిష్యత్తు బాగుండాలని ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. మీరు కూడా అలానే అనుకుంటే ఎల్ఐసీ పాలసీ ని తీసుకోవచ్చు. మన కోసం LIC ఎన్నో రకాల పాలసీలని అందిస్తోంది. ఎల్ఐసీ పాలసీ ని తీసుకుంటే మంచిగా లాభాలు ఉంటాయి.
LIC పిల్లల కోసం మనీ బ్యాక్ పాలసీని తీసుకు వచ్చింది. ఈ ప్లాన్ తీసుకోవడం వల్ల మెచ్యూరిటీ సమయంలో మంచిగా డబ్బులు వస్తాయి. 12 ఏళ్ల వరకు వయసు ఉన్న పిల్లల పేరుపై ఈ పాలసీని తీసుకోవచ్చు. అలానే ఈ పాలసీ టర్మ్ వచ్చేసి 25 ఏళ్లు. ఐదేళ్ల వయస్సు లో పాలసీ తీసుకున్నట్లయితే పాలసీ టర్మ్ 20 ఏళ్లు అవుతుంది. మీరు కనుక పిల్లలు పుట్టిన తొలి ఏడాదిలోనే పాలసీ తీసుకుంటే పాలసీ టర్మ్ 25 ఏళ్లు అవుతుంది.
మీ పిల్లలకి 18 ఏళ్లు, 20 ఏళ్లు, 22 ఏళ్లు వచ్చినప్పుడు బీమా మొత్తంలో 20 శాతం వస్తుంది. మెచ్యూరిటీ కన్నా ముందుగానే మూడు విడతల్లో మీకు డబ్బులొస్తాయి. రూ. 10 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకున్నట్లయితే నెలకు దాదాపు రూ. 4200 ప్రీమియం పడుతుంది. రోజుకి మీరు రూ. 140 పొదుపు చేస్తే చాలు. పాలసీ పొందిన వారికి మూడు విడతల్లో రూ.2 లక్షల చొప్పున మొత్తంగా రూ. 6 లక్షలు వస్తాయి. మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి రూ. 15.4 లక్షల వరకు మీకొస్తాయి. ఈ విధంగా పాలసీ తీసుకోవడం వల్ల రూ. 21 లక్షలకు పైగా మీరు పొందే అవకాశం వుంది.