పాప పెళ్లికి రూ.28 లక్షలు.. రోజూ ఇంత కట్టేస్తే సరిపోతుంది..!

-

భవిష్యత్తు ని దృష్టి లో పెట్టుకుని చాలా మంది డబ్బులని ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. ఈ రోజుల్లో చాలా మంది డబ్బులని స్కీమ్స్ వంటి వాటిలో పెడుతున్నారు. చదువుల కోసం లక్షల్లో ఖర్చు అవుతోంది. పైగా పెళ్లి చేయాలంటే కూడా ఎంతో ఖర్చు అవుతోంది. అయితే ఆర్థిక సమస్యలేమీ లేకుండా ఉండాలంటే ఓ ప్లాన్ అందుబాటులో ఉంది. జీవన్ తరుణ్ పాలసీ ని అందిస్తోంది LIC. పిల్లలకు ఒక వయసు వచ్చే సరికి రూ.28 లక్షలు వస్తాయి.

ఇక దీని కోసం పూర్తి వివరాలు చూద్దాం. ఎల్ఐసీ జీవన్ తరుణ్ పాలసీ కొనుగోలు చేయాలంటే, పిల్లల వయస్సు కనిష్ఠంగా 3 నెలల నుంచి గరిష్ఠంగా 12 ఏళ్ల మధ్య ఉండాలి. తల్లిదండ్రులు ఈ పాలసీని కొనుగోలు చేసి క్రమంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. 20 ఏళ్ల వయసు వచ్చే వరకు ఇందులో పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత 5 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. 5 ఏళ్ల వరకు ఎలాంటి ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు.

మొత్తంగా మీ పిల్లల కి 25 ఏళ్లు వచ్చిన తర్వాత మీరు పెట్టిన డబ్బులు అలానే బోనస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. చదువులకి కానీ పెళ్లి కి కానీ ఈ డబ్బులు ఖర్చు చెయ్యచ్చు. రూ. 75 వేల బేసిక్ సమ్ అష్యూర్డ్ చేయాల్సి వుంది. నెల, మూడు నెలలు, ఆరు నెలల, వార్షిక ప్రీమియం ఆప్షన్లు ని సెలెక్ట్ చేసుకోవాలి. 12 ఏళ్ల వయసు ఉన్న తన పాప పేరుపై పాలసీ ఎంచుకుంటే రోజుకు 150 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ. 54, 750 అవుతుంది.

అలా పాపకు 20 ఏళ్లు వచ్చే దాకా 8 ఏళ్ల పాటు ప్రీమియం పే చేయాలి. రోజుకు 150 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ. 54, 750. 20 ఏళ్లు వచ్చే వరకు అంటే 8 ఏళ్ల పాటు ప్రీమియం పే చేయాలి. డిపాజిట్ రూ. 4.38 లక్షలు అవుతుంది. మీకు రూ. 2.47 లక్షలు బోనస్ వస్తుంది. పాప వయసు 25 ఏళ్లు వచ్చే సరికి మీకు రూ. 7 లక్షలు. 2 ఏళ్లు ఉన్నప్పుడు రోజుకు రూ.171 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 18 ఏళ్లలో పెట్టుబడి రూ. 10, 89, 196 అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత రూ. 28, 24, 800 మీకొస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version