ఒక రూపాయి కూడా కట్టకుండా మీరు ఎక్కువ డబ్బులని పొందాలని అనుకుంటున్నారా..? అయితే ఇదే మీకు సూపర్ ఆఫర్. ఉచితంగా డబ్బులు పొందాలని మీరు అనుకుంటే ఇప్పుడు ఓ ఆఫర్ అందుబాటులో ఉంది. ఒక్క రూపాయి పే చేయకుండా రూ. 30 వేలు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ కాంటెస్ట్ ని పెడుతోంది. విజేతగా నిలిస్తే.. రూ. 30 వేలు మీకు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఆన్‌లైన్ ఎస్సే కాంపిటీషన్ ని నిర్వహిస్తోంది. దీనిలో పాల్గొని విజేతగా నిలిస్తే అప్పుడు ఏకంగా రూ. 30 వేలు మీ చేతికి వస్తాయి.
వివరాలు చూస్తే.. మై గౌ వెబ్‌సైట్‌లో ఈ కాంటెస్ట్ లో పాల్గొనవచ్చు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆఫ్ ఇండియా ఈ నేషనల్ ఆన్‌లైన్ ఎస్సే రైటింగ్ ని నిర్వహిస్తోంది. ఆడిట్ దివాస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ పోటీ జరగనుంది. భారత ప్రజాస్వామ్యం కాగ్ పాత్ర అనే టాపిక్ మీద రాయాల్సి ఉంటుంది. జవాబుదారీతనం, సుపరిపాలనను ప్రోత్సహించడంలో కాగ్ ప్రాముఖ్యత తెలిసేలా రాయాలి. పరిమిత కాలం వరకే ఇది అందుబాటులో ఉంటుంది.
విజేతగా నిలిస్తే రూ. 30 వేలు పొందొచ్చు. రెండవ ప్రైజ్ కింద రూ. 20 వేలు. మూడో ప్రైజ్ కింద రూ. 15 వేలు వస్తాయి. ఇలా ముగ్డురికి ప్రైజ్‌లు వస్తాయి. ఒకరు కేవలం ఒక వ్యాసాన్ని మాత్రమే రాయాలి. 1500 కన్నా ఎక్కువ పదాలలో రాయకూడదు. ఇంగ్లీష్ లేదా హిందీలో రాయచ్చు. essay2023@cag.gov.in కు మీ వ్యాసాన్ని పంపాలి. ఆగస్ట్ 20 వరకు మాత్రమే ఛాన్స్.