ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది ఉద్యోగులకి చాల ముఖ్యమైనది. అయితే ఉద్యోగులకి 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ని ఇస్తుంది. కానీ ఒక్కోసారి యూఏఎన్ నెంబర్‌ను ఎవరైనా సరే మరచిపోతూ ఉండచ్చు. అయితే మరి అలాంటప్పుడు నెంబర్ ని ఎలా పొందొచ్చు అనేది చూద్దాం.
ఈ నెంబర్ కనుక లేకపోతే బ్యాలెన్స్ చెక్ చేయడం కుదరదు. అయితే ఉద్యోగి మొదటిసారి ఉద్యోగంలో చేరాక ఈ యూఏఎన్ నెంబర్ ని ఇస్తారు. ఒకవేళ కనుక పీఎఫ్ అకౌంట్ సంస్థ నుంచి మరో సంస్థకు ఉద్యోగం మారినా అదే నెంబర్ ఉంటుంది. అలానే యూఎన్‌ఏ నెంబర్‌తో కేవైసీ వివరాలు లింక్ చెయ్యాలి. ఒకవేళ ఈ నెంబర్ ని మరచిపోతే ఎలా పొందచ్చనేది చూద్దాం.
దీని కోసం ముందు మీరు అధికారిక వెబ్ సైట్ ఈపీఎఫ్‌లో పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.
తరవాత యుఏఎన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీరు మీ మెంబర్ ఐడీ, రాష్ట్రం, రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ వంటి వివరాలను ఇవ్వాలి.
పీఎఫ్ మెంబర్ ఐడీ శాలరీ స్లిప్‌లో ఉంటుంది.
ఇప్పుడు గెట్ ఆథరైజేషన్ పిన్ మీద నొక్కండి.
పీఎఫ్ నెంబర్ తో లింక్ అయిన మొబైల్ కి పిన్ నెంబర్ మెసేజ్ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాలి.
వాలిడేట్ ఓటీపీ అండ్ గెట్ యూఏఎన్‌పై క్లిక్ చేయాలి.
మీ మొబైల్ నెంబర్‌కు యూఏఎన్ నెంబర్ మెసేజ్ వస్తుంది.