దమ్ముంటే ఆ నలుగురు హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోండి : కంగనా

-

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కాంట్రవర్షియల్ బ్యూటీ ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు కంగనా రనౌత్. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి నటించడమే కాదు… ఎలాంటి వివాదం లో అయినా వేలు పెట్టి సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా కంగనారనౌత్ కి బాగా తెలుసు. ముఖ్యంగా సుశాంత్ ఆత్మహత్య తర్వాత కంగన తన కామెంట్స్ డోస్ మరింత పెంచింది అని చెప్పాలి. బాలీవుడ్ ప్రముఖుల ను టార్గెట్ చేస్తూ సంచలన విమర్శలు గుప్పిస్తోంది.

ఇక ఇటీవలే సుశాంత్ ఆత్మహత్య కేసులో అనూహ్యంగా వెలుగులోకి వచ్చినా డ్రగ్స్ వ్యవహారంపై కూడా కంగనా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా డ్రగ్స్ కేసులో ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు అధికారులు. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల కంగనా చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారిపోయాయి. గతంలో బాలీవుడ్ లో 99 శాతం మంది నటీనటులు డ్రగ్స్ తీసుకుంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న… రణ్‌వీర్‌ సింగ్‌, రణ్‌బీర్‌ కపూర్‌, విక్కీ కౌశల్‌, అయాన్‌ ముఖర్జీ లు దమ్ముంటే డ్రగ్స్ టెస్ట్ చేయించుకుని క్లీన్ అని నిరూపించుకోవాలి అంటూ సవాల్ విసిరింది కంగన.

Read more RELATED
Recommended to you

Exit mobile version