Ghani: వరుణ్‌ తేజ్ కు విషెస్ చెప్పిన సొట్టబుగ్గల సుందరి!

-

మెగా ప్రిన్స్ వరణ్ తేజ్ ‘ గని’ సినిమా రేపు శుక్రవారం ప్రజలకు ముందుకు రాబోతోంది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో గని సినిమా రాబోతోంది. అయితే ఈ సందర్భంగా సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ‘ గని’ సినిమా యూనిట్ కు విషెస్ చెప్పింది. మామూలుగా అయితే ఇందులో పెద్ద వింతేమి లేదు. కానీ ఇటీవల కాలంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు లవ్ లో ఉన్నారనే ప్రచారం బాగా జరిగింది. 

‘అందాల రాక్షసి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ… వరుణ్ తేజ్ సరసన తొలిసారి ‘మిస్టర్’ మూవీలో నటించింది. అయితే ‘మిస్టర్’ చిత్రం పరాజయం పాలైనా, ఆ తర్వాత ‘అంతరిక్షం’ మూవీలో మరోసారి వరుణ్ తేజ్ సరసన నటించే అవకాశాన్ని అందుకుంది లావణ్య త్రిపాఠి. ఇక ఆమెకు మెగా ఫ్యామిలీ హీరోలతోనూ బాగానే సాన్నిహిత్యం ఉంది. గీతా ఆర్ట్స్, దాని అనుబంధం సంస్థల్లోనూ ‘భలే భలే మగాడివోయ్, శ్రీరస్తు – శుభమస్తు, చావు కబురు చల్లగా’ వంటి సినిమాలలో నటించింది లావణ్య త్రిపాఠి.

రేపు ‘ గని’ విడుదల సందర్భంగా ‘‘వరణ్ తేజ్ ఈ  పాత్ర కోసం నువ్వు 110 శాతం ఎఫర్ట్ పెట్టావని తెలుసు. మీ టీం చేసిన హార్డ్ వర్క్ కు తగిన ప్రతిఫలం ప్రేక్షకుల నుంచి లభించాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రత్యేకంగా విషెస్ చెప్పడం ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశం అయింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version