2024లో మౌళిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేసిన GHMC..!

-

2024లో మౌళిక సదుపాయాల కల్పనకు ముఖ్యంగా పెద్ద పీట వేసింది GHMC. టీజీ బీపాస్ ద్వారా 14 వేల 43 భవనాలకు అనుమతులివ్వగా 815 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. అలాగే హెచ్ సిటీ ప్రాజెక్టు ద్వారా 38 రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులకు ఆమోదం తెలిపింది. ఇంకా ఎస్ఎన్డీపీ ద్వారా 528 కోట్లతో 34 నాలాల పనులు పూర్తి చేసింది GHMC. అదే విధంగా 149 కోట్లతో వివిధ జంక్షన్లు, రోడ్ల సుందరీకరణ పనులు చేసింది.

అలాగే 15 కోట్లతో 14 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ నిర్మాణం పూర్తి చేసిన GHMC.. పేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా ఉద్యోగులు అటెండెన్స్ నమోదు చేసే ప్రక్రియను మొదలు పెట్టింది. ఇక 9,278 కొత్త ఎస్ఈడీ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన GHMC.. 5174 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు 564 కోట్ల బ్యాంకు రుణాలు కూడా ఇప్పించినట్లు స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version