తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం..!

-

తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025లో మీకు ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. 2024లో సంవత్సరంలో మీరు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఏర్పడిన మీ మంచి ప్రభుత్వం అందరి ఆశలు నెరవేర్చేలా అహర్నిశలు పని చేస్తోంది. కేవలం ఆరునెలల్లోనే సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలను ఆవిష్కృతం చేశాం. పేదవాడి భవిష్యత్‌కు భరోసా ఇస్తూ పింఛన్ల మొత్తాన్ని పెంచాం. ప్రతి ఇంట కట్టెల పొయ్యి కష్టాలు తీరుస్తూ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ధాన్యం సేకరణ డబ్బులు 48 గంటల్లో చెల్లించి రైతన్నలో సంతోషాన్ని నింపాం.

మీ ప్రయాణం సాఫీగా సాగాలని రాష్ట్రంలో రహదారులన్నీ గుంతులు లేకుండా చేస్తున్నాం. కొత్త ప్రభుత్వ పాలసీలతో మళ్లీ పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నాంది పలికాం. కొత్త సంక్షేమ పథకాలు, మరిన్ని అభివృద్ది కార్యక్రమాలకు 2025 సంవత్సరం వేదిక కాబోతోంది. ‘స్వర్ణాంధ్ర-2047’ విజన్ సాకారమే లక్ష్యంగా పది సూత్రాల ప్రణాళిక అమలు చేస్తూ అటు ప్రజా సంక్షేమాన్ని – ఇటు రాష్ట్రాభివృద్ధిని మీ అందరికి సహకారంతో చేసి చూపిస్తాం. మీ అందరికీ మరోసారి హ్యాపీ న్యూ ఇయర్ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version