ప్రజావాణికి వచ్చిన కంప్లెయింట్ లు అన్ని శాఖల వారీగా విభజించి పరిష్కరిస్తున్నాం. జనవరి నుంచి ఇప్పటివరకు 3 వేల ఫిర్యాదులు రాగా.. 500 పెండింగ్ లో ఉన్నాయి అని GHMC కమీషనర్ ఇలంబరితి అన్నారు. టౌన్ ప్లానింగ్ కు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. నగరంలో వీధి కుక్కల సమస్య ఎక్కువగా ఉంది. కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై హైకోర్టుకు రిపోర్ట్ ఇచ్చాం.
అలాగే నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హెచ్ సిటి ప్రాజెక్టు ద్వారా ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, ఆర్ యూ బీ లు నిర్మించబోతున్నాం. కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్ ల అభివృద్ధికి త్వరలో టెండర్లు పిలవబోతున్నాం. నగరంలో స్ట్రీట్ లైట్ మెయింటెయిన్ చేసే EESL సంస్థతో పలు ఇష్యూలు ఉన్నాయి. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా సిటీలో పలు చోట్ల స్మార్ట్ బిన్స్ ఏర్పాటు చేశాం. మార్చి వరకు 800 పాయింట్ల లో స్మార్ట్ బిన్స్ ఏర్పాటు చేస్తాం. ఇందిరమ్మ ఇళ్ల సర్వే 95 శాతం పూర్తయింది. సర్వే కంప్లీట్ అయ్యాక వార్డు సభలు నిర్వహిస్తాం అని GHMC కమీషనర్ పేర్కొన్నారు.