ప్రతి ఇంట్లో ఉండే పోపుల డబ్బాల్లో ఆవాలు కచ్చితంగా ఉంటాయి కదా.. ఇవి వంటల్లో ఎందుకు వాడుతారో మన అమ్మవాళ్లకు కూడా పెద్దగా తెలియదు. కావలంటే ఓ సారి అడిగి చూడండి.. తాలింపులో వేస్తే.. మంచి స్మెల్ వస్తుంది. చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపిస్తాయి అంటారు. పప్పులో ఆవాలు లేకుండా ఆసలు తాలింపు వేయరు. చిన్నగా ఉండే ఆవగింజ కొండంత మేలు చేస్తుందట. అంతలా ఇందులో ఏం ఉందంటే..
వీటిలో మెగ్నీషియం, కాల్షియం, మాగనీస్, జింక్, ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్దము ఉంటాయి . ఘాటైన వాసనను కలిగి ఉండే ఆవాలు ఆయుర్వేదంలో బాగా వాడతారు.. పైథోన్యూట్రియంట్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ ఎక్కువగా లభిస్తాయి. ఓర్ని ఇన్నీ ఉన్నాయా అనిపిస్తుందా..?
- మలబద్దకం కూడా తగ్గుతుంది.
- ఆవాలు బరువు తగ్గడానికి బాగా తొడ్పడతాయి.
- ఆవాలు రక్తపోటును సమర్ధంగా తగ్గిస్తాయి.
- ఆవాల్లోని విటిన్ ఏ , ఐరన్ , ఫ్యాటీ యాసిడ్లు జుట్టు దట్టంగా పెరగడానికి తొడ్పడతాయి.
- ఆవాల్లో సెలీనియమ్, మెగ్నీషియమ్ ఎక్కువ. వాటి యాంటి ఇన్ ఫ్లమేటరీ గుణం వల్ల మంట, నొప్పి తగ్గుతాయి.
ఆవాల్లోని నియాసిన్ వంటి పోషకాల వల్ల కొలెస్ట్రాల్ పాళ్లు తగ్గుతాయి. రక్తనాళాల్లో పాచిలాగ పేరుకునే అథెరోస్క్లిరోసిస్ వంటి కండిషన్లను ఆవాలు నివారిస్తాయి.
ఆవాలు ఆస్తమాను తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా ఆవాలతో కూడిన ఆహారం తినేవాళ్లలో ఆస్తమా అదుపులో ఉండటంతో పాటు జలుబు, ఛాతీ పట్టేసినట్లు ఉండటం వంటి సమస్యలు తగ్గుతాయి.
ఆవాల్లో ఉండే ఫోటోన్యూట్రియెంట్ గుణాలు, పీచుపదార్ధాల కారణంగా అవి జీర్ణవ్యవస్థకు మేలు చేయడంతో పాటు, జీర్ణవ్యవస్థలో వచ్చే అనేక రకాల క్యాన్సర్లకు నివారిస్తాయి ఆవాలలో విటమిన్ బీ కాంప్లెక్స్ ఎక్కువ. దాంతో వ్యాధి నిరోధక శక్తి సమకూరడమే కాకుండా, జీవక్రియలు సమర్ధంగా జరుగుతాయి. ఆవాలలోని కెరోటిన్స్, జియాగ్జాంథిన్స, ల్యూటిన్ వంటి పోషకాలు వయసు పెరగడం వల్ల వచ్చే అనర్ధాలను తగ్గించి దీర్ఘకాలం యవనంగా ఉంటటానికి తొడ్పడతాయి.
కూరల్లో ఇవి సరిపడా వేస్తేనే బాగుంటుంది..ఎక్కువ వేస్తే కొంతమందికి అసలు నచ్చదు. ఇప్పుడు ఇన్ని లాభాలు ఉన్నాయి అని తెలిశాక..ఏకంగా ఆవలతో కారపొడి చేయించుకుని తిన్నా తప్పులేదు అనిపిస్తోందా..! భారతీయ వంటల్లో వాడే ప్రతి ఐటమ్ వెనక ఎన్నో ఔషధాలు దాగి ఉన్నాయి..ఇది ఎందుకు, అది ఎందుకు అని వదిలేయకుండా వీలైనంత వరకూ వంటల్లో ప్రతీదీ వాడటానికి..తినడానికి ట్రై చేయండి.