జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో జీహెచ్ఎంసి

-

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అనగానే… చాలా వరకు మంచి ఆదాయం ఉంటుంది తిరుగులేని శక్తి అని చెప్తూ ఉంటారు. కాని ఇప్పుడు పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందని లెక్కలు చెప్తున్నాయి. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్దితుల్లో జీహెచ్ఎంసీ ఉంది అనే వార్తలు కలకలం రేపాయి. 1వ తారీఖు రావాల్పిన జీతాలు ఇప్పటి రాలేని పరిస్దితి హైదరాబాద్ లో ఉంది.

ఆదాయం లేక అప్పులతో సతమతమవుతున్న బల్దియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ట్యాక్స్ లు వసూలు చేసి జీతాలు ఇవ్వాలని జోనల్ ఆఫీసులకు మెసేజ్ లు పంపడం సంచలనం అయింది. ఆదాయం పడిపోయి అప్పుల్లో బల్దియా కూరుకుపోయింది. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో బల్దియా కష్టాలు అన్నీ ఇన్నీ కాదు.

ప్రభుత్వ పథకాల అమలు భారం బల్దియా పైనే పడటం కూడా గమనార్హం. ఎన్నికల ముందు ప్రాపర్టీ ట్యాక్స్ డిస్కాంట్ ఇవ్వడంతో మరిన్ని కష్టాలు వచ్చాయి. జీహెచ్ఎంసీ జీతాల ఖర్చు ప్రతినెలా 130 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ప్రతినెలా కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్న బిల్లులు 120 కోట్ల రూపాయలు అని లెక్కలు చెప్తున్నాయి. ప్రభుత్వం భవనాలు, కార్యాలయాలల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version