వివేకా హత్య కేసు విచారణకు మళ్ళీ బ్రేక్

-

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజులు ముందు అప్పటి ప్రతిపక్షనేత ఇప్పటి ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి వైయస్ వివేకానంద రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.. అయితే అప్పట్లో ఆయనను హత్య చేసింది టీడీపీ అని వైసిపి, లేదు సొంత బాబాయి జగనే చంపించాడని టిడిపి రాజకీయ విమర్శలు చేసుకున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరిన జగన్ తాను అధికారంలోకి రాగానే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి ఊరుకున్నారు. అయితే వివేకానంద రెడ్డి కుమార్తె సిబిఐ ఎంక్వైరీ కావాలని పట్టుబట్టడంతో కేంద్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వయిరీ ఆదేశించింది.

అయినా సరే సీబీఐ బృందానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదనే వాదన వినిపిస్తోంది. నిన్న పులివెందుల కోర్టుకు వెళ్లిన సీబీఐ బృందానికి మళ్లీ చుక్కెదురైంది. దీంతో కేసు విచారణకు మళ్ళీ బ్రేక్ పడినట్లు చెబుతున్నారు. కీలక ఆధారాల పత్రాలు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పడంతో సీబీఐ బృందం తిరిగి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఆధారాల కోసం నిన్న సీబీఐ బృందం పులివెందుల కోర్టుకు వచ్చింది. ఈ హత్య కేసులో సిట్ దాఖలు చేసిన ఆధారాల పత్రాలు సిబిఐకి అందచేయాలని చేయాలని గతంలో పులివెందుల కోర్టుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా సరే ఇప్పుడు కోర్టు ఇవ్వలేనని చెప్పడంతో తిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version