రేపటితో ఆస్తి పన్ను చెల్లింపు గడువు పూర్తి…అర్థరాత్రి 11 గంటల వరకు చెల్లింపునకు అవకాశం

-

జీహెచ్‌ఎంసీ పరిధిలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2000 కోట్ల నిర్ధేశిత లక్ష్యంలో గురువారం వరకు దాదాపు 11 లక్షల మంది నుంచి రూ. 1614 కోట్లు మాత్రమే వసూళ్లను రాబట్టుకున్నది. ఆస్తి పన్నుచెల్లింపు గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. ఆస్తి పన్ను చెల్లింపు చివరి రోజు శుక్ర‌వారం కావడంతో సిటీజన్‌ సర్వీస్‌ సెంటర్లు, సర్కిల్‌, ప్రధాన కార్యాలయంలో ఆ రోజు అర్థరాత్రి 11 గంటల వరకు కౌంటర్లు పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు. కాగా ఆస్తి పన్ను చెల్లించని వారంతా శనివారం నుంచి అదనంగా రెండు శాతం వడ్డీతో సంబంధిత ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఆస్తి పన్ను బకాయిదారులపై గడిచిన 10 రోజులుగా స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నది. మొండి బకాయిదారులను గుర్తించి వారికి రెడ్‌ నోటీసులు జారీ చేయడం.. ఆయా నోటీసులకు స్పందించని వ్యాపార సముదాయాలను సీజ్‌ చేస్తున్నారు. ఇప్పటికే 80 శాతం మేర వసూళ్లను రాబట్టామని, మిగిలిన 20 శాతం మంది బకాయిదారులకు రెడ్‌ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గడిచిన వారం రోజులుగా ఈ ప్రక్రియ వేగవంతం చేశారు.
పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version