ప్రపంచంలోనే బెస్ట్ ఫీల్డర్ జడేజా : జాంటీ రోడ్స్

-

ప్రస్తుత క్రికెట్ లో అద్భుతమైన ఫీల్డర్ టీమిండియా ఆల్ రౌండర్ జడేజా అని ప్రపంచంలోనే బెస్ట్ ఫీల్డర్ జాంటీ రోడ్స్ చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్ లో ప్రపంచంలోనే బెస్ట్ ఫీల్డర్ ఎవరి అడిగితే అందరికీ గుర్తొచ్చే తొలి పేరు జాంటీ రోడ్స్. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ మాజీ క్రికెటర్ తన అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యంతో ప్రపంచ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించాడు. కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్ లతో మంత్రముగ్దుల్ని చేశాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ… అద్భుతమైన ఫీల్డర్ ఎవరో కాదు… టీమిండియా ఆల్ రౌండర్ జడేజా.

ప్రస్తుతానికి ప్రపంచంలో గొప్ప ఫీల్డర్ జడేజా అని జాంటీ రోడ్స్ చెప్పాడు. ఫీల్డింగ్ విభాగం మెరుగు పడటానికి ఐపీఎల్ కూడా ఒక కారణమని అన్నాడు. ఐపీఎల్ ప్రారంభం కాగానే అన్ని ఫ్రాంఛైజీలు ఫీల్డింగ్ పై దృష్టి సారిస్తాయని చెప్పాడు. ఐపీఎల్ తొలి సీజన్ ను నుంచి ప్రతి సీజన్ లో తాను 12 నుంచి 13 మంది బెస్ట్ ఫీల్డర్లను చూశానని తెలిపాడు. తన అభిప్రాయం ప్రకారం మరింత మంది ఫీల్డింగ్ కోచ్ లు అవసరమని చెప్పాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version